Published on Oct 16, 2024
Government Jobs
యూఐఐసీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
యూఐఐసీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు

చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీ) దేశవ్యాప్తంగా ఉన్న త‌మ కార్యాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 200

వివ‌రాలు: 

1. స్పెషలిస్టులు: 100 
2. జనరలిస్ట్‌లు: 100

విభాగాలు: రిస్క్ మేనేజ్‌మెంట్, లీగల్ డేటా అనలిటిక్స్‌, ఫైనాన్స్‌ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, ఆటోమొబైల్, కెమికల్/ మెకాట్రానిక్స్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో సీఏ/ సీడబ్ల్యూఏ, డిగ్రీ (లా/ బీకామ్), బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంకామ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 30 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.50,925 - రూ.96,765.

దరఖాస్తు ఫీజు: రూ.1000+జీఎస్‌టీ; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.250+జీఎస్‌టీ.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-11-2024

Website:https://uiic.co.in/en/home