Published on Sep 9, 2025
Current Affairs
యుఎస్‌ ఓపెన్‌
యుఎస్‌ ఓపెన్‌

స్పెయిన్‌కి చెందిన కార్లోస్‌ అల్కరాస్‌ యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌గా నిలిచాడు.

2025, సెప్టెంబరు 8న న్యూయార్క్‌లో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌లో ఈ రెండో సీడ్‌ ఆటగాడు 6-2, 3-6, 6-1, 6-4తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌సీడ్‌ యానిక్‌ సినర్‌ (ఇటలీ)ని ఓడించాడు. 

యుఎస్‌ ఓపెన్‌ గెలిచే సమయానికి అల్కరాస్‌ వయసు 22 ఏళ్ల 125 రోజులు.

అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడు అతడు.

జాన్‌ బోర్గ్‌ (22 ఏళ్ల 32 రోజులు) ముందున్నాడు.

పిన్న వయసులో మూడు భిన్న గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను గెలిచిన ఆటగాడు అల్కరాసే.

మాట్స్‌ విలాండర్‌ (24 ఏళ్ల 6 రోజులు) రికార్డును అధిగమించాడు.

అల్కరాస్‌ ఇంకా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలవలేదు.