ప్రపంచంలో మేధోపర హక్కుల (ఐపీఆర్) రక్షణ, అమలు విషయంలో అత్యంత సవాళ్లు విసిరే దేశాల్లో భారత్ కూడా ఉందని, అందుకే మళ్లీ ‘ప్రాధాన్య పరిశీలనా దేశాల జాబితా’లో చేర్చినట్లు అమెరికా స్పష్టం చేసింది. గత ఏడాది కాలంగా మేధోహక్కుల రక్షణ, అమలు విషయంలో భారత్ అస్థిరత్వంగా ఉందని ద యూఎస్ ట్రేడ్ రెప్రజెంటేటివ్ (యూఎస్‌టీఆర్) 2025 స్పెషల్ 301 నివేదిక పేర్కొంది. కొన్ని పేటెంట్ అంశాల విషయంలో భారత్‌లో ఇబ్బంది ఉంది. పేటెంట్ రద్దు అవకాశాలు, ఇతర ప్రక్రియలపైనా సమస్యలున్నాయి. పేటెంట్ దరఖాస్తుదారులకు పేటెంట్ గ్రాంట్ లభించడానికి ఎక్కువ సమయం పడుతుండడమూ ఒక సవాలుగా ఉందని వివరించింది. ‘ఇండియన్ పేటెంట్స్ యాక్ట్’ను అర్థం చేసుకోవడంపైనా అస్పష్టత ఉందని పలు వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆరోపించింది.