ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణకు గురయ్యే భూమి శాతం పెరుగుతోందని ఐరాస అనుబంధ సంస్థ యూఎన్‌సీసీడీ తన నివేదికలో పేర్కొంది. గత 30 ఏళ్లుగా 77 శాతం భూమి పొడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొందని పేర్కొంది.
ఈ సమయంలో భూమిపై పొడి నేలల సంఖ్య 43 లక్షల చదరపు కి.మీ. పెరిగిందని, ఇది మొత్తం భూభాగంలో 40 శాతంపైనేనని వెల్లడించింది.
2024, డిసెంబరు 9న సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన యూఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డిసెర్టిఫికేషన్ (యూఎన్‌సీసీడీ) సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు.