ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని నోముండి ఇనుప గనిలో పూర్తిగా మహిళలతోనే ఒక షిఫ్ట్ నిర్వహిస్తున్నట్లు టాటా స్టీల్ ప్రకటించింది.
ఒక షిఫ్ట్ పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారని సంస్థ తెలిపింది.
భారీ ఎర్త్ మూవింగ్ మెషినరీ, లోడర్, డ్రిల్, డోజర్ ఆపరేటర్లు, షిఫ్ట్ పర్యవేక్షణతో పాటు అన్ని మైనింగ్ కార్యకలాపాల్లో మహిళా ఉద్యోగులే ఈ షిఫ్ట్‌లో ఉంటారని టాటా స్టీల్ పేర్కొంది.