- రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల ఎన్నికల్లో మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయా కౌన్సిళ్ల కార్యనిర్వాహక కమిటీల్లోనూ మహిళా లాయర్ల ప్రాతినిధ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)కి 2025, డిసెంబరు 4న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి ధర్మాసనం సూచించింది.
- యోగమయ, శెహ్లా చౌదరి అనే ఇద్దరు మహిళా న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.