ప్రభుత్వ రంగ కంపెనీలు సహా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న 179 సంస్థల్లో ఒక్క మహిళా డైరెక్టర్ కూడా లేరు. కంపెనీల చట్టం - 2013 ప్రకారం, నిర్దిష్ట కంపెనీల్లో కనీసం ఒక మహిళా డైరెక్టర్ అయినా ఉండాలి. ప్రతి నమోదిత కంపెనీకీ ఈ నిబంధన వర్తిస్తుంది. రూ.100 కోట్లు - అంతకంటే ఎక్కువ పెయిడప్ క్యాపిటల్ ఉండి, టర్నోవరు రూ.300 కోట్ల కంటే అధికంగా ఉన్న పబ్లిక్ కంపెనీలన్నీ బోర్డులో కనీసం ఒక మహిళను నియమించుకోవాలి.
కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉండాల్సిన 708 ప్రభుత్వ యాజమాన్య సంస్థల్లో (ప్రభుత్వ రంగ కంపెనీలు సహా) 529 కంపెనీలే ఈ నిబంధన పాటించాయి. 179 కంపెనీలు ఒక మహిళనూ తమ బోర్డులో చేర్చుకోలేదు. వివిధ పాలనపరమైన కారణాల వల్ల ఆయా కంపెనీల బోర్డుల్లో మహిళల నియామకం జరగలేదని లోకసభకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా తెలిపారు.