Published on Jan 3, 2025
Current Affairs
మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

సావిత్రీబాయి ఫులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025, జనవరి 2న ఉత్తర్వులు జారీ చేసింది.

ఏటా జనవరి 3న సావిత్రీబాయి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది.

ఆమె మహాత్మా జ్యోతిబా ఫులే సతీమణి, బాలికా విద్య కోసం విశేష కృషి చేశారు.

ప్రస్తుతం తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 50 శాతానికిపైగా మహిళా ఉపాధ్యాయులే ఉన్నారు.

వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.