మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ఒక రోజు నెలసరి సెలవు ఇవ్వనున్నట్లు ఎల్ అండ్ టీ ప్రకటించింది.
దేశంలో ఇటువంటి సెలవును దిగ్గజ కార్పొరేట్ సంస్థ ప్రకటించడం ఇదే తొలిసారి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఛైర్మన్, ఎండీ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ తెలిపారు.
ప్రస్తుతం ఎల్ అండ్ టీలో మొత్తం 60,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 9% (5000) మంది మహిళలు.