Published on May 13, 2025
Government Jobs
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తిరుపతిలో ఉద్యోగాలు
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తిరుపతిలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ తిరుపతిలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చిల్డ్రన్‌ హోమ్స్‌లో అవుట్‌ సోర్సింగ్‌, పార్ట్‌టైం ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అర్హత గల మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 20

వివరాలు:

1. కుక్‌- 05

2. హెల్పర్‌/ హెల్పర్‌ కమ్‌ నైట్‌ వాచ్‌మెన్‌- 05

3. ఎడ్యుకేటర్‌- 04

4. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కమ్‌ మ్యూజిక్‌ టీచర్‌- 02

5. పీటీ ఇన్‌స్ట్రక్టర్‌ కమ్‌ యోగా టీచర్‌- 03

6. హౌజ్‌ కీపర్‌- 01

చిల్డ్రన్‌ హోంలు: శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, కోట.

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, ఏడో తరగతి ఉత్తీర్ణత/ అనుత్తీర్ణత, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ/ బీఎడ్‌, బీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.  

జీతం: నెలకు కుక్‌కు రూ.9,930; హెల్పర్‌/ హెల్పర్‌ కమ్‌ నైట్‌ వాచ్‌మెన్‌కు రూ.7,944; ఇతర పోస్టులకు రూ.10,000.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.250; ఎస్సీ/ ఎస్టీ/ బీసీ అభ్యర్థులకు రూ.200.

చిరునామా: డీడబ్ల్యూ అండ్‌ సీడబ్ల్యూ అండ్‌ ఈఓ, రూం నెం.506, ఐదో అంతస్తు, కలెక్టరేట్‌, తిరుపతి.

దరఖాస్తు చివరి తేదీ: 20.05.2025

Website: https://tirupati.ap.gov.in/