భారత మహిళల హాకీ జట్టు కోచ్‌గా షూవర్డ్ మరైన్ (నెదర్లాండ్స్) మళ్లీ నియమితుడయ్యాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టుకు మరైన్ కోచ్‌గా ఉన్నాడు. తర్వాత పదవీ కాలం పూర్తవడంతో కోచ్‌గా తప్పుకొన్నాడు. 2025లో హరేంద్ర సింగ్ శిక్షణలో భారత జట్టు పేలవ ప్రదర్శన చేసింది. దీంతో డిసెంబర్‌లో హరేంద్ర తన పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో హాకీ ఇండియా మరోసారి మరైన్‌కు కోచ్ బాధ్యతలు అప్పగించింది.