మహిళల వన్డే ప్రపంచకప్ విజేతకు రూ.39.55 కోట్ల భారీ ప్రైజ్‌మనీ దక్కనుంది.
కప్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తం నగదు బహుమతిగా ఇవ్వనుండడం ఇదే తొలిసారి.
భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచకప్ సెప్టెంబరు 30న ఆరంభం కానుంది.
గత టోర్నీ (2022) ఛాంపియన్ (రూ.11.65 కోట్లు)కు లభించిన మొత్తంతో పోలిస్తే ఇది మూడు రెట్ల కంటే ఎక్కువ.
ప్రస్తుత కప్‌లో రన్నరప్‌గా నిలిచే జట్టు రూ.19.77 కోట్లు అందుకుంటుంది.
సెమీస్‌లో ఓడే రెండు టీమ్‌లకు రూ.9.89 కోట్ల చొప్పున లభిస్తాయి.
అయిదు, ఆరు స్థానాల్లో నిలిచే జట్లకు రూ.62 లక్షలు.. ఏడు-ఎనిమిది స్థానాలు సాధించే టీమ్‌లకు రూ.24.71 లక్షల చొప్పున దక్కుతాయి.