మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ను భారత్ నెగ్గింది. 2025, నవంబరు 24న ఢాకాలో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 35-28తో చైనీస్ తైపీని ఓడించింది. రీతూ నేగి సారథ్యంలోని భారత్.. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా టైటిల్ నిలబెట్టుకుంది. 11 దేశాలు పోటీపడిన ఈ టోర్నీలో గ్రూప్ దశలో థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, జర్మనీ, ఉగాండాపై ఘన విజయాలు అందుకున్న భారత్.. సెమీస్‌లో 33-21తో ఇరాన్‌ను ఓడించింది.