డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ నెగ్గింది. 2024, నవంబరు 20న రాజ్‌గిర్ (బిహార్)లో జరిగిన ఫైనల్లో భారత్ 1-0తో ఒలింపిక్ రజత పతక విజేత చైనాను ఓడించింది.
జరిగిన భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను దీపిక (31వ) సాధించింది. దీపిక మొత్తం 11 గోల్స్‌తో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచింది.
భారత్‌కు ఇది మూడో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. ఇంతకుముందు 2016, 2023లో ఈ టోర్నీ విజేతగా నిలిచింది.