Published on Apr 25, 2025
Current Affairs
మహారాష్ట్ర
మహారాష్ట్ర

మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లాలో సుమారు మూడు వేల ఏళ్లనాటి నాగరికతను గుర్తించినట్లు నాగ్‌పుర్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రకటించారు. ఆ కాలం నాటి ఇళ్ల అనవాళ్లను కూడా తాము కనుగొన్నట్లు తెలిపారు. వాటిని ఇనుపయుగ కాలం నాటివిగా భావిస్తున్నారు. నాగ్‌పుర్‌ యూనివర్సిటీకి చెందిన ప్రాచీన భారత సంస్కృతి, పురావస్తు, చారిత్రక విభాగానికి చెందిన బృందం 2023-24లో బాబుల్‌గావ్‌ తాలుకాలోని పచ్ఖేడ్‌ గ్రామంలో గల పురావస్తు స్థలంలో తవ్వకాలు నిర్వహించింది. ఆ సందర్భంగా 8.73 మీటర్ల పరిధిలో పురాతన సాంస్కృతిక ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆ ఆనవాళ్లను ఇనుపయుగ కాలం, దాని ఉపకాలాలకు చెందినవాటిగా విభజించామన్నారు.