థాయ్‌లాండ్‌లో జరిగిన మిస్ యూనివర్స్-2025 పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ విజేతగా నిలిచింది. 2024లో మిస్ యూనివర్స్‌గా నిలిచిన డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్.. ఫాతిమాకు అందాల కిరీటాన్ని అందజేశారు.
ఈ పోటీల్లో మొత్తం 120 మంది పాల్గొన్నారు. తొలి రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీణార్ సింగ్, రెండో రన్నరప్‌గా వెనెజువెలాకు చెందిన స్టిఫానీ అబాసలీ నిలిచారు.
ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహంచిన మణికా విశ్వకర్మ స్విమ్‌సూట్ రౌండ్‌తో టాప్ 30 వరకు చేరుకుంది.