అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామిలకు కీలక బాధ్యతలు అప్పగించారు.
వీరిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్’ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.