Published on Oct 4, 2024
Scholarships
ముస్కాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024
ముస్కాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024

పేద విద్యార్థుల చదువును ప్రోత్సహించేందుకు వాల్వోలిన్ కమ్మిన్స్ సంస్థ ‘ముస్కాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్-2024’ పేరిట ఉపకార వేతనాన్ని అందిస్తోంది. కమర్షియల్ వెహికల్ డ్రైవర్లు (ఎల్ఎంవీ/ హెచ్‌ఎంవీ), మెకానిక్‌, ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) కుటుంబాలకు చెందిన 9 నుంచి 12 తరగతులు చదివే విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌నకు అర్హులు. 

వివరాలు:

ముస్కాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024

అర్హతలు:

9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

అస్సాం, మణిపుర్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, బిహార్, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, మేఘాలయ, తమిళనాడు, పశ్చిమ్‌ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారై ఉండాలి.

కమర్షియల్ వెహికల్ డ్రైవర్లు (ఎల్ఎంవీ/ హెచ్‌ఎంవీ), మెకానిక్‌, ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) కుటుంబాలకు చెందిన విద్యార్థులు అర్హులు. 

దరఖాస్తు చేసుకునే విద్యార్థి అంతకు ముందు తరగతిలో కనీసం 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.

కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు.

స్కాలర్‌షిప్: రూ.12,000 వరకు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-10-2024.

Website:http://muskaan.valvolinecummins.com/?cuid=tt_MKSP1_20240705_1