నౌకాయాన రంగంలో భారత్ అరుదైన ఘనత సాధించింది. ఇటీవల గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి బయల్దేరిన ‘ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య’ 2026, జనవరి 14న ఒమన్ రాజధాని మస్కట్‌కు విజయవంతంగా చేరుకుంది. అక్కడ జల వందనం స్వీకరించింది.
ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య ఎలాంటి ఇంజిన్ లేకుండా పూర్తిగా తెరచాపల సాయంతో ప్రయాణించి గమ్యాన్ని చేరుకుంది. ఇది దాదాపు 1,400 కిలోమీటర్ల ప్రయాణాన్ని.. 17 రోజుల్లో పూర్తిచేసింది.