మలేసియాలోని బుకిట్ కోరస్‌లో పురాతన సంస్కృత శాసనాలు లభ్యమయ్యాయి. అక్కడ తవ్వకాలు జరపగా బుద్ధుడి విగ్రహంతోపాటు దీర్ఘచతురస్రాకారంలో ఉన్న మూడు రాళ్లు దొరికాయి. వాటిపై సంస్కృత శాసనాలున్నాయి. అవి 8, 9 శతాబ్దాలకు చెందినవిగా భావిస్తున్నారు. బుకిట్ కోరస్ అనేది ఒకప్పటి మహాయాన బౌద్ధ పవిత్ర క్షేత్రం. గతంలో ఇక్కడ జరిపిన తవ్వకాల్లో 8వ శతాబ్దంనాటి పల్లవ కాలంనాటి శాసనాలు లభించాయి.