Published on Nov 19, 2024
Current Affairs
మల్లికా శ్రీనివాసన్‌
మల్లికా శ్రీనివాసన్‌

ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక బోర్డు (పీఈఎస్‌బీ) అధిపతిగా మరో ఏడాదీ మల్లికా శ్రీనివాసన్‌ను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆమె వయసు 65 ఏళ్లు దాటిన తర్వాత కూడా,  పదవీ కాలాన్ని పొడిగించారు. ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ (టీఏఎఫ్‌టీ) ఛైర్మన్, ఎండీగా మల్లికా శ్రీనివాసన్‌ ఉన్నారు. 

2021 ఏప్రిల్‌లో పీఈఎస్‌బీ ఛైర్‌పర్సన్‌గా మూడేళ్ల కాలానికి ఆమెను ప్రభుత్వం నియమించింది. 2024 ఏప్రిల్‌ 9న ఆమె పదవీ కాలం పూర్తవగా, నవంబరు 18న ఆమె వయసు 65 సంవత్సరాలు దాటే వరకు ఆమెను కొనసాగిస్తున్నట్లు అప్పట్లో పేర్కొంది.

తాజాగా మరో ఏడాది గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.