టెస్టు క్రికెట్ 150వ వార్షికోత్సవం సమయంలో మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం (ఎంసీజీ)లో డేనైట్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
2027, మార్చి 11న ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య ఈ టెస్టు ఆరంభం కానుంది. ఎంసీజీలో జరగబోయే తొలి గులాబి బంతి మ్యాచ్ ఇదే.
1877లో ఈ మైదానంలో జరిగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ తలపడ్డాయి.
1977లో నిర్వహించిన వందో టెస్టులోనూ ఇంగ్లిష్ జట్టుతోనే ఆసీస్ ఆడింది.
ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ కంగారూ జట్టు 45 పరుగుల తేడాతోనే గెలవడం విశేషం.