మాల్దీవుల ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసే లక్ష్యంతో ఆ దేశానికి భారత్ 50 మిలియన్ డాలర్ల(రూ.424 కోట్లు) సహాయం అందించింది. ఇది తమ ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని మాల్దీవుల ప్రభుత్వం పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ద్వారా ఖజానా బిల్లుల నుంచి వడ్డీ రహిత సాయాన్ని 2019 నుంచి మాల్దీవులకు భారత్ ఇస్తూ వస్తోంది. ఈ విధానాన్ని మరో ఏడాది పొడిగించింది.