రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి వైవీ రాజు 2025, ఏప్రిల్ 24న ప్రధాని మోదీ చేతుల మీదుగా ‘జాతీయ ఉత్తమ పంచాయతీ’ అవార్డు అందుకున్నారు. ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా, సొంత ఆదాయ వనరులను సమకూర్చుకుంటున్నందుకు ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో మాల్ ఈ అవార్డుకు ఎంపికైంది. బిహార్‌లోని మధుబనిలో పురస్కార ప్రదానోత్సవం జరిగింది.