Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 22, 2026
Current Affairs
మరో అయిదేళ్ల పాటు అటల్‌ పెన్షన్‌ యోజన
మరో అయిదేళ్ల పాటు అటల్‌ పెన్షన్‌ యోజన
  • అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్‌ అందించే ఉద్దేశంతో తీసుకొచ్చిన అటల్‌ పెన్షన్‌ యోజన పథకాన్ని (ఏపీవై) మరో అయిదేళ్లపాటు కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు దీన్ని పొడిగించేందుకు 2026, జనవరి 21న ఆమోదం తెలిపింది. 2015 మే 9 ప్రారంభమైన ఈ పథకంలో 2026 జనవరి 19 నాటికి 8.66 కోట్ల మంది చందాదారులుగా చేరారు. 
  • అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు 60 ఏళ్లు దాటాక పెన్షన్‌ అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) పథకాన్ని తీసుకొచ్చింది.