భారత ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్’ను ప్రదానం చేయనున్నట్లు
మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం ప్రకటించారు.
మారిషస్ ప్రధాని రామ్‌గులాం, ఆయన భార్య వీణా రామ్‌గులాంకు ప్రవాస భారతీయుల హోదా (ఓసీఐ) కార్డులను మోదీ అందజేశారు.
తన రెండు రోజుల పర్యటనలో భాగంగా 2025, మార్చి 11న మోదీ మారిషస్ రాజధాని పోర్ట్ లూయీకి చేరుకున్నారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ చర్చలు జరిపారు.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్-మారిషస్ నిర్ణయించాయి.
వివిధ రంగాల్లో గల ప్రత్యేక, సన్నిహిత సంబంధాల పటిష్ఠానికి చర్యలు తీసుకోవాలని నిశ్చయించాయి.