భారత పర్యటనకు వచ్చిన మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రాంగులాం.. ప్రధాని నరేంద్ర మోదీతో 2025, సెప్టెంబరు 11న వారణాసిలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా భారతీయులు అధికంగా ఉండే మారిషస్‌కు మన దేశం రూ.5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.
దీంతోపాటు తీర ప్రాంత భద్రత వంటి 7 కీలక ఒప్పందాలను ఆ దేశంతో కుదుర్చుకుంది.
మారిషస్ సార్వభౌమత్వాన్ని గౌరవించే చాగోస్ ఒప్పందం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.
2025, మేలో డీగో గార్షియాతోపాటు చాగోస్ ద్వీపాలను బ్రిటన్ మారిషస్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
పొరుగే ముందు అనే విధానంలో భాగంగా భారత్ విజన్ అయిన ‘మహాసాగర్‌లో (మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఎక్రాస్ రీజియన్) మారిషస్ కీలక పాత్రధారని మోదీ తెలిపారు.