ద్వీప దేశం మారిషస్ ఎన్నికల్లో ప్రతిపక్ష ‘ద అలయెన్స్ ఫర్ ఛేంజ్’ కూటమి విజయం సాధించింది. ప్రతిపక్ష నేత నవీన్ రామ్‌గులామ్ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించనున్నారు. ఆయన గతంలో 1995-2000, 2005-14 వరకు ప్రధానిగా పనిచేశారు.
2024, నవంబరు 10న జరిగిన ఎన్నికల్లో దేశంలో ఉన్న దాదాపు అన్ని సీట్లలోనూ ప్రతిపక్ష కూటమి విజయకేతనం ఎగరవేసింది. ప్రధాని ప్రవీణ్ జగన్నాథ్ నాయకత్వంలోని అధికార కూటమి.. ప్రజలు నేరుగా ఓటింగ్‌లో పాల్గొనే 60 సీట్లలోనూ ఓటమి పాలైంది.