Published on Nov 18, 2024
Current Affairs
మారిషస్‌లో భారత్‌ హైకమిషనర్‌గా అనురాగ్‌ శ్రీవాత్సవ
మారిషస్‌లో భారత్‌ హైకమిషనర్‌గా అనురాగ్‌ శ్రీవాత్సవ

మారిషస్‌లో భారతదేశ తదుపరి హైకమిషనర్‌గా అనురాగ్‌ శ్రీవాత్సవ 2024, నవంబరు 16న నియమితులయ్యారు. 1999 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యాలయంలో నేపాల్‌-భూటాన్‌ విభాగానికి సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్నారు.

హిందూ మహాసముద్రం ప్రాంతంలో వ్యూహాత్మక ద్వీప దేశంగా ఉన్న మారిషస్‌లో ప్రస్తుతం భారత హైకమిషనర్‌గా కె.నందిని సింగ్లా ఉన్నారు.