దిల్లీలోని హెచ్‌సీఎంసీటీ మణిపాల్ హాస్పిటల్ వైద్యులు మరణించిన మహిళ శరీరంలో ఆగిపోయిన రక్తప్రసరణను తిరిగి ప్రారంభించారు. ఆమె అవయవాలను దానం చేసేందుకు వీలుగా దీన్ని చేపట్టినట్లు వారు వెల్లడించారు. ఆసియాలోనే ఈ ప్రక్రియను చేపట్టడం ఇదే మొదటిసారి. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా పక్షవాతం బారిన పడిన గీతా చావ్లా (55) అనే మహిళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా కుటుంబసభ్యులు నవంబరు 5న అమెను మణిపాల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు ఆమె మరణించింది. ఆమె అవయవాలు దానం చేయాలనుకుంటున్నట్లు మృతురాలి కుటుంబం తెలియజేయడంతో అక్కడి వైద్యబృందం నార్మోథెర్మిక్ రీజినల్ పెర్ఫ్యూజన్ (ఎన్‌ఆర్‌పీ) అనే అరుదైన ప్రక్రియను నిర్వహించింది.