Notice: We've enabled a new exam system. If you face any issue during the exam, please contact your institute for support.
మరాఠా పాలకులు నిర్మించిన పలు కోటలను ‘మరాఠా మిలిటరీ లాండ్‌స్కేప్స్’ పేరుతో ప్రఖ్యాత యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో తాజాగా చేర్చారు.
పారిస్‌లో జరుగుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ (డబ్ల్యూహెచ్‌సీ) 47వ సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యునెస్కో 2025, జులై 11న వెల్లడించింది.
మహారాష్ట్రలోని సాల్హేర్ కోట, శివ్‌నేరీ కోట, లోహ్‌గఢ్, ఖండేరీ కోట, రాయగఢ్, రాజ్‌గఢ్, ప్రతాప్‌గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా కోట, విజయ్‌దుర్గ్, సింద్‌దుర్గ్, తమిళనాడులోని జింజీ కోట ఈ ‘మరాఠా మిలిటరీ లాండ్‌స్కేప్స్’లో భాగంగా ఉన్నాయి.