భారత వెయిట్ లిఫ్టర్ మార్టినా దేవి (18) ఆసియా జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గింది.
2024, డిసెంబరు 25న దోహాలో జరిగిన మహిళల జూనియర్ 87+ కేజీల విభాగంలో ఆమె రెండో స్థానం సాధించింది.
మణిపురికి చెందిన మార్టినా స్నాచ్‌లో 96 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 129 కేజీలు మొత్తంగా 225 కిలోలు లిఫ్ట్ చేసింది.
ఆమె స్నాచ్‌లో రజతం, క్లీన్ అండ్ జర్క్‌లో కాంస్యం కూడా గెలుచుకుంది.