వచ్చే మూడేళ్లలో (2028 నాటికి) ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అమెరికా ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.
ప్రపంచంలో అత్యంత ఆదరణ ఉన్న విపణి కావడం, ప్రపంచ తయారీ రంగంలో వాటా పెంచుకోవడం ఇందుకు దోహదం చేస్తుందని తెలిపింది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా అయిదో స్థానంలో ఉన్న భారత్ 2026లో అమెరికా, చైనా, జర్మనీ తరవాత స్థానానికి; ఆ తదుపరి రెండేళ్లలో జర్మనీని అధిగమించి మూడో స్థానానికి ఎదుగుతుందని వివరించింది.
ఈ నివేదికలోని అంశాలు:
ప్రపంచ జీడీపీలో భారత వాటా ప్రస్తుత 3.5% నుంచి 2029లో 4.5 శాతానికి చేరే అవకాశం ఉంది.
ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా భారత్ 1990లో 12వ స్థానంలో ఉంది. 2000లో 13వ స్థానానికి దిగివచ్చింది. ఆ తర్వాత 2020లో 9వ స్థానానికి, 2023లో 5వ స్థానానికి ఎగబాకింది.
2024-25లో వృద్ధి 6.3 శాతంగా, 2025-26లో 6.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది.