ప్రముఖ చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ ‘మార్క్ లింటన్ హిస్టరీ ప్రైజ్’ 2026ను సొంతం చేసుకున్నారు. ప్రాచీన భారతదేశంపై ఆయన రచించిన ‘ది గోల్డెన్ రోడ్: హౌ ఏన్సియంట్ ఇండియా ట్రాన్స్‌ఫార్మ్‌డ్ ది వరల్డ్’ పుస్తకానికి ఈ బహుమతి దక్కింది. నీమన్ ఫౌండేషన్ ఫర్ జర్నలిజం, కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ జర్నలిజం సంయుక్తంగా అందిస్తున్న మూడు పురస్కారాల్లో ఇదీ ఒకటి.
చరిత్రకు సంబంధించిన అంశంపై గొప్ప రచనలు, పరిశోధనలు చేసిన వారికి ఈ బహుమతితో పాటు 10,000 అమెరికన్ డాలర్ల (రూ.9,28,798) ప్రైజ్‌మనీని అందజేస్తారు.