అమెరికా నూతన విదేశాంగ మంత్రిగా మార్కో రుబియో 2025, జనవరి 21న ప్రమాణం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ క్యాబినెట్‌లో బాధ్యతలు చేపట్టిన తొలి మంత్రిగా నిలిచారు.
అమెరికా ప్రయోజనాల పరిరక్షణ, దేశాన్ని మరింత బలోపేతం చేయడం, సురక్షితంగా తీర్చిదిద్దడమే ట్రంప్ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఈ సందర్భంగా మార్కో రుబియో తెలిపారు.