Published on Sep 23, 2024
Current Affairs
‘మ్యాపింగ్‌ ది ఫిన్‌టెక్‌ ఇన్నోవేషన్‌ ల్యాండ్‌స్కేప్‌ ఇన్‌ ఇండియా’
‘మ్యాపింగ్‌ ది ఫిన్‌టెక్‌ ఇన్నోవేషన్‌ ల్యాండ్‌స్కేప్‌ ఇన్‌ ఇండియా’

వినూత్నత కోసం కృత్రిమ మేధ (ఏఐ), జెనరేటివ్‌ కృత్రిమ మేధ(జెన్‌ఏఐ)లపై 90 శాతం దేశీయ ఆర్థిక సంస్థలు దృష్టి పెడుతున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది. ‘మ్యాపింగ్‌ ది ఫిన్‌టెక్‌ ఇన్నోవేషన్‌ ల్యాండ్‌స్కేప్‌ ఇన్‌ ఇండియా’ పేరిట పీడబ్ల్యూసీ ఇండియా ఈ నివేదికను వెలువరించింది. 
నివేదికలోని అంశాలు:

ఏఐ, జెన్‌ఏఐ తర్వాత 74 శాతం మంది డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్థిక సేవల రంగంలో భవిష్యత్‌ అంచనాలు, నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఈ టెక్నాలజీలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ సర్వేలో 31 ఆర్థిక సంస్థలు (బ్యాంకులు, బీమా సంస్థలు, ఫిన్‌టెక్‌లు) పాల్గొన్నాయి. 

90% మంది ఏఐ, జెన్‌ ఏఐలకు ఓటేయగా, 84 శాతం మంది వినియోగదారు సేవలు, ఇతర సంస్థల కొనుగోళ్లు, ఆన్‌బోర్డింగ్, సర్వీసింగ్‌ ముఖ్యమని అభిప్రాయపడ్డారు. వినూత్నతకు ప్రోడక్ట్‌ డిస్ట్రిబ్యూషన్‌ కీలకమని 50 శాతానికి పైగా పేర్కొన్నారు.