మయన్మార్‌కు భారత్ 2025, ఏప్రిల్ 5న 442 మెట్రిక్ టన్నుల ఆహారాన్ని అందించింది.
భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌లో ఆపరేషన్ బ్రహ్మా పేరుతో భారత్ సహాయక చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ ఘరియాల్ 442 మెట్రిక్ టన్నుల ఆహారాన్ని తిలావా ఓడరేవుకు చేర్చి, ఆ దేశ ప్రతినిధి బృందానికి అప్పగించింది.
405 టన్నుల బియ్యం, 30 టన్నుల వంట నూనె, 5 మెట్రిక్ టన్నుల బిస్కెట్లు, 2 టన్నుల నూడుల్స్‌ను అందజేసినట్లు పేర్కొంది.