భారత్‌లో తొలి మ్యూజికల్ రోడ్డును ప్రారంభించి ముంబయి తీరప్రాంత రహదారుల అధికారులు రికార్డు సృష్టించారు. హంగేరియన్ టెక్నాలజీ సాయంతో నారిమన్ ప్రాంతం నుంచి వర్లి వైపు వెళ్లే రహదారిపై పలు సంగీత స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ రోడ్డుపై దాదాపు 500 మీటర్ల మేర వాహనదారులకు ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాలోని ‘జయ హో’ పాట వినిపించనుంది.
వాహనాలు 70 - 80 కి.మీ.ల వేగంతో ప్రయాణించినప్పుడు రోడ్డుపై ఉన్న ప్రత్యేక పట్టీల రాపిడికి ‘జయహో’ అని ధ్వని తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ప్రజల్లో దేశభక్తి భావాన్ని మరింత పెంచేందుకు ఈ విధంగా డిజైన్ చేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.