భారత రక్షణ దళాల కోసం 6 అత్యాధునిక మానవ రహిత వైమానిక వాహనాల (యూఏవీ)ను, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రఘు వంశీ ఏరోస్పేస్ అనుబంధ డీప్‌టెక్ బ్రాండ్ ఆర్రోబోట్ ఆవిష్కరించింది. వీటిలో ఆర్‌వీ అస్త్ర, ఆర్‌వీ మాయ, ఆర్‌వీ లక్ష్య, ఆర్‌వీ రుద్ర, ఆర్‌వీ ఇంద్ర, ఆర్‌వీ యోధ, ఆర్‌వీ దృష్టి ఉన్నాయి. నిఘా, దాడి, యుద్ధభూమి లాజిస్టిక్స్, బలగాలకు మద్దతు వంటి అవసరాలకు ఇవి ఉపయోగపడతాయి.
పౌర అవసరాల కోసమూ వీటిని వినియోగించుకోవచ్చు. కొన్ని 300 కిలోమీటర్లు, మరికొన్ని అంతకు మించీ ప్రయాణించగలవు.