త్వరలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకూ సంక్లిష్ట కృత్రిమ మేధ (ఏఐ) ప్రక్రియల నిర్వహణ సామర్థ్యం దక్కే అవకాశాలు ఉన్నాయి. అందుకు ఉపయోగపడే అనలాగ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫాంను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) పరిశోధకులు మానవ మెదడు పనితీరును స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి చేశారు.
* ఐఐఎస్‌సీ పరిశోధకులు అభివృద్ధి చేసిన సాంకేతికతలో ఒక మాలిక్యులార్ ఫిల్మ్‌లో ఏకంగా 16,500 కండక్టెన్స్ దశల్లో డేటా స్టోరేజీ, ప్రాసెసింగ్ ప్రక్రియలు సాగుతాయి.