హెచ్‌ఎస్‌బీసీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా భారతీయ నేపథ్యం ఉన్న మన్‌వీన్ పామ్ కౌర్ నియమితులయ్యారు. 160 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న హెచ్‌ఎస్‌బీసీకి సీఎఫ్‌ఓగా నియమితులైన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. లండన్‌లో స్థిరపడ్డ 60 ఏళ్ల పామ్ కౌర్ నాలుగు దశాబ్దాలుగా బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నారు. ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఆడిట్, కొత్త విధానాల అమలు.. అంశాల్లో ఆమెకు అపార అనుభవం ఉంది.
* ఆమె 1983లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీకాం, మార్కెటింగ్, ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశారు.