Published on Dec 27, 2024
Current Affairs
మన్మోహన్‌ సింగ్‌ మరణం
మన్మోహన్‌ సింగ్‌ మరణం

భారత మాజీ ప్రధాన మంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్‌ సింగ్‌ (92) 2024, డిసెంబరు 26న దిల్లీలో మరణించారు.

యూపీఏ హయాంలో 2004లో దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్‌ సింగ్, 2014 వరకూ కొనసాగారు. 33 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 

ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పశ్చిమ పంజాబ్‌లోని గహ్‌లో 1932 సెప్టెంబరు 26వ తేదీన సిక్కు కుటుంబంలో మన్మోహన్‌ సింగ్‌ జన్మించారు. 

1987లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. 

1991లో ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రి అయ్యారు.