హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్(మేనేజ్) 2026-28 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీడీఎం (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన రెండేళ్ల పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు, అగ్రి రంగంలో మేనేజీరియల్ నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు ఈ ప్రోగ్రామ్‌ను రూపొందిచారు.
వివరాలు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్)- 2026-2028
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్ సైన్సెస్/ అగ్రికల్చర్ సంబంధ విభాగాల్లో) ఉత్తీర్ణతతో పాటు క్యాట్-2025 స్కోరును కలిగి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 2026 నాటికి డిగ్రీ అర్హత సమర్పించాలి.
ఎంపిక విధానం: క్యాట్-2025 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, అకడమిక్ రికార్డ్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పరీక్ష/ ఇంటర్వ్యూ కేంద్రం: మేనేజ్ క్యాంపస్, రాజేంద్రనగర్, హైదరాబాద్.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10-02-2026.
ఎస్సై రైటింగ్, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 2026.
ఫలితాలు: ఏప్రిల్/మే 2026.
Website:https://www.manage.gov.in/