ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) 2025, ఏప్రిల్ 4న ముంబయిలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు హరికృష్ణన్ గిరి గోస్వామి. 1937, అవిభక్త భారతదేశంలోని అబోటాబాద్ పట్టణంలో ఆయన జన్మించారు. ప్రస్తుతం పాక్‌లోని ఖైబర్‌పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సులో ఉంది. దేశభక్తి చిత్రాలకు చిరునామాగా నిలిచి ‘భరత్ కుమార్’గా ప్రసిద్ధి చెందారు. 1957లో ‘ఫ్యాషన్’ సినిమాతో నటుడిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయనను హీరోగా పరిచయం చేసిన చిత్రం ‘కాంచ్ కీ గుడియా’. ఓ వైపు నటుడిగా అలరిస్తూనే.. 1967లో దర్శకుడిగా ‘ఉప్‌కార్’ చిత్రంతో మెగా ఫోన్ పట్టారు మనోజ్. ఆయన దశాబ్దాలుగా భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే సహా పలు పురస్కారాలు అందుకున్నారు.