పశ్చిమ కనుమల పరిరక్షణకు జీవితాంతం కృషి చేసిన ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ (83) 2025, జనవరి 8న పుణెలో మరణించారు. భారత పర్యావరణ పరిశోధన, పరిరక్షణ విధానాలను రూపొందించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. పశ్చిమ కనుమలపై గాడ్గిల్ అద్భుత కృషికి గానూ 2024లో ఐక్యరాజ్య సమితి ఆయనకు అత్యున్నత పర్యావరణ పురస్కారమైన ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు’ను ప్రదానం చేసింది. పద్మ భూషణ్ సహా పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయనను వరించాయి.