మధుమేహం కారణంగా అధిక ఆర్థిక భారం పడుతోన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 16.5 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, 11.4 లక్షల కోట్ల డాలర్లతో భారత్ ద్వితీయ స్థానంలో, 11 లక్షల కోట్ల డాలర్లతో చైనా తృతీయ స్థానంలో ఉంది.
2020-2025 మధ్య 204 దేశాలపై మధుమేహం వల్ల పడిన ఆర్థిక భారాన్ని పరిశీలించిన ‘ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలసిస్’, ‘వియన్నా యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్’, ‘బిజినెస్ ఇన్ ఆస్ట్రియా’ల పరిశోధకులు ఈ మేరకు వెల్లడించారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనధికార సంరక్షణ వ్యయం ప్రపంచ జాతీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ)లో 1.7 శాతం (10 లక్షల కోట్ల డాలర్లు)గా ఉందని తెలిపారు.