Published on Oct 17, 2024
Walkins
మిధాని, హైదరాబాద్‌లో అసిస్టెంట్ ఖాళీలు
మిధాని, హైదరాబాద్‌లో అసిస్టెంట్ ఖాళీలు

హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఖాళీల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 31

వివరాలు:

1. అసిస్టెంట్ (మెటలర్జీ): 13 పోస్టులు

2. అసిస్టెంట్ (మెకానికల్): 02 పోస్టులు

3. అసిస్టెంట్ (ఫిట్టర్): 09 పోస్టులు

4. అసిస్టెంట్ (వెల్డర్): 04 పోస్టులు

5. అసిస్టెంట్ (డ్రైవర్): 03 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత, ఎల్‌ఎంవీ/ హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం కలిగి ఉండాలి.

జీత భత్యాలు: నెలకు అసిస్టెంట్ (మెటలర్జీ)/ అసిస్టెంట్ (మెకానికల్) పోస్టులకు రూ.31,720; అసిస్టెంట్ (డ్రైవర్) పోస్టులకు రూ.27,710. ఇతర పోస్టులకు రూ.28,960.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్/ ప్రొఫీషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

వాక్-ఇన్ తేదీలు: 28, 29-10-2024; 25, 26, 27-11-2024.

వేదిక: మిధాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం, కంచన్‌బాగ్, హైదరాబాద్.

Website:https://midhani-india.in/