Published on Aug 21, 2025
Walkins
మిధానిలో అసిస్టెంట్‌ ఉద్యోగాలు
మిధానిలో అసిస్టెంట్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్‌ (మిధాని) వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టులు: 50

వివరాలు:

విభాగాలు: మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, టర్నర్‌, వెల్డర్‌.

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు. 

జీతం: నెలకు రూ.29,800 - రూ.32,640.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 సెప్టెంబర్‌ 8, 9, 10, 11, 12, 15, 16, 17.

వేదిక: మిధాని కార్పొరేట్‌ ఆఫీస్‌ ఆడిటోరియం, హైదరాబాద్‌.

Website:https://midhani-india.in/department_hrd/career-at-midhani/