ప్రధాని నరేంద్ర మోదీతో 2025, ఆగస్టు 19న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ అయ్యారు. సరిహద్దులో శాంతిని ఉమ్మడిగా కాపాడుకోవడం, వాణిజ్యానికి సరిహద్దుల్ని మళ్లీ తెరవడం, వివిధ రకాల వీసాలకు వెసులుబాటు కల్పించడం, పెట్టుబడుల వెల్లువను ప్రోత్సహించడం, నేరుగా విమాన సర్వీసులను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించడం, నదీ జలాల పంపకంలో సహకరించుకోవడంపై ఉభయపక్షాలు సుముఖత వ్యక్తం చేశాయి. భారత్-చైనా సంబంధాలు స్థిరంగా పురోగతి సాధిస్తున్నాయని ఈ సమావేశానంతరం మోదీ వ్యాఖ్యానించారు.