ప్రధాని నరేంద్ర మోదీతో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా 2026, ఫిబ్రవరి 21న దిల్లీలో భేటీ అయ్యారు. రానున్న ఐదేళ్ల కాలంలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 3,000 కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని భారత్-బ్రెజిల్ నిర్ణయించాయి. ఈ సందర్భంగా రెండు దేశాలు కీలక ఖనిజాల రంగంలో సహకారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
రక్షణ, ఇంధనం, వైద్యసేవ, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి అనేక ఇతర రంగాల్లోనూ సంబంధాలను బలోపేతం చేయాలని ఇరుదేశాల నేతలూ నిర్ణయించారు.